calender_icon.png 2 February, 2026 | 3:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌పై రాజకీయ కక్షసాధింపులు మానుకోవాలి

02-02-2026 01:53:25 PM

ఎమ్మెల్సీ డా.శ్రవణ్ కుమార్ దాసోజు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బహిరంగ లేఖ

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) కేసీఆర్‌పై రాజకీయ కక్షసాధింపులకు పాల్పడటం తగదని ఎమ్మెల్సీ డా.శ్రవణ్ కుమార్ దాసోజు(BRS MLC Dasoju Sravan Kumar) హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదని, ఆయన తెలంగాణ ప్రజల భావోద్వేగమని పేర్కొన్నారు. ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అభివృద్ధి దిశగా ముందుకు నడిపించిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు.

అధికార అహంకారంతో కేసీఆర్‌పై తప్పుడు కేసులు పెట్టడం, రాజకీయంగా అణిచివేయాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. ఇది ఒక వ్యక్తిపై చేసే దాడి కాదని, తెలంగాణ ఆత్మగౌరవంపై చేసే దాడిగా ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదని, ప్రజలు ఇచ్చిన తాత్కాలిక బాధ్యత మాత్రమేనని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలని సూచించారు.

అధికారాన్ని ప్రజల సేవకు ఉపయోగించాలి గానీ ప్రతీకార రాజకీయాలకు వాడితే చరిత్ర క్షమించదని హెచ్చరించారు. కేసీఆర్‌పై(Kalvakuntla Chandrashekar Rao) విమర్శలకంటే రాష్ట్ర పరిపాలనపై దృష్టి పెట్టాలని, అవినీతి నిర్మూలనతో పాటు పారదర్శక పాలన అందించాలన్నారు. మంచి పాలనతో ప్రజల మద్దతు పొందాలని సూచించారు. కేసీఆర్‌ను అణచివేయాలని చేసిన ప్రతి ప్రయత్నం ప్రజల్లో ఆయనపై మరింత ప్రేమాభిమానాలను పెంచుతుందని డా.శ్రవణ్ కుమార్ దాసోజు(Dasoju Sravan Kumar) స్పష్టం చేశారు.