calender_icon.png 2 February, 2026 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిన్న మళ్లీ ఉద్యమ రోజులు గుర్తుకొచ్చాయి

02-02-2026 01:45:12 PM

హైదరాబాద్: నిన్న మళ్లీ ఉద్యమ రోజులు గుర్తుకువచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) తెలిపారు. అన్ని గ్రామాలు, పట్టణాల్లో పార్టీ శ్రేణులు కదిలారని కేటీఆర్ తెలిపారు. 7 వేలకు పైగా గ్రామాల్లో దిష్టిబొమ్మలు దగ్ధం చేశారని చెప్పారు. నిన్న నందినగర్ లో 900 మంది పోలీసులను పెట్టారని కేటీఆర్ సూచించారు. పోలీసులంతా ఒకేచోట ఉంటే నగరంలో పట్టపగలే కాల్పులు, దోపిడీలు జరుగుతాయన్నారు.

రేవంత్ రెడ్డికి ఏపీ, కేంద్రంతో ఉన్న ఇబ్బందులను అర్థం చేసుకోగలం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వైఖరి వల్ల తెలంగాణకు నష్టం జరుగుతోందని ఆరోపించారు. నల్లమల సాగర్ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో సహజ వనరులు, జలవనరులు దోపిడీ జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి స్కామ్ పై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నుంచి సమాధానం లేదన్నారు. కేంద్రం అప్పు 3 రెట్లు పెరిగి.. నెలకు రూ. లక్ష కోట్లు వడ్డీలకే పోతుందని కేటీఆర్ లేక్క చెప్పారు. పేదలు, రైతు కూలీలకు ఉపయోగపడే ఉపాధిహామీని కుదించారని తెలిపారు. ఎరువుల రాయితీ, ఆహార రాయితీకి నిధులు తగ్గించారని వెల్లడించారు.