02-02-2026 01:54:58 PM
హనుమకొండ టౌన్, (విజయక్రాంతి): శ్రీశ్రీశ్రీ పరమ పూజ్య మహా ప్రేమావతార మూలాధి పరా స్వయంభూః సద్గురు పరబ్రహ్మ శ్రీ జైమహావిభోశ్రీః వారి దివ్యానుగ్రహముతో లోక కళ్యాణార్థం సర్వజనుల శ్రేయస్సుకై మాఘమాస పౌర్ణిమ సందర్భంగా వరంగల్ లో ఓమౌజయా: మహాలక్ష్మీ మహాగురు శ్రీ చక్ర యజ్ఞాన్ని ఓమౌజయాః ఏకోపాసన మహా ధర్మం ఆధ్వర్యంలో పరార్థ ఓమౌజయులు, సత్యోమౌజయులు, భక్తోమౌజయులు, ఓమౌజయా విశ్వ మహిళా సేవా సమితి సభ్యుల సహకారంతో నిర్వహించారు. స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సర మాఘ మాస పౌర్ణమి వేడుకలు వరంగల్ హనుమకొండలోని లష్కర్ బజార్, పబ్లిక్ గార్డెన్ పక్కన, ఉన్న టి.టి.డి కళ్యాణ మండపంలో ఉదయం పెద్ద ఎత్తున భక్తులతో ఓమౌజయాః స్వయంభూః చైతన్య శక్తిపీఠం ర్యాలీ నిర్వహించారు.
సాయంత్రం ఎంతో విశిష్టత కలిగిన శ్రీ ప్రభూ పల్లకి సేవ చేపట్టారు. అనంతరం ఓమౌజయాః మహాలక్ష్మీ మహాగురు శ్రీచక్ర యజ్ఞం -కలశపూజ, పరానాగేంద్రుడికి ప్రత్యేక హారతులు, అభిషేకం కార్యక్రమాలను నిర్వహించారు. యజ్ఞానంతరం దివ్య ప్రసాదం, ఉచిత అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ దైవ, ధర్మ కార్యక్రమంలో వరంగల్ పురప్రముఖులు, ప్రజలు అందరూ పాల్గొన్నారు. వరంగల్ లో దైవచింతన కలిగిన ఎక్కువ శాతం ప్రజలు ఉండడం అదృష్టమని ఓమౌజయా ఏకోపాసన మహా ధర్మం సంస్థ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మాధికారులు శ్రీ పరమోజీ బ్రహ్మ శాస్త్రజ్ఞ, శ్రీ పరమోజీ శ్రీ ఋషి ప్రజ్ఞానంద స్వామీజీ, సత్యోమౌజయులు, వివిధ సేవా సమితి సభ్యులు, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.