calender_icon.png 23 May, 2025 | 3:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు హైదరాబాద్‌కు కవిత

23-05-2025 09:29:24 AM

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kalvakuntla Kavithaహైదరాబాద్‌కు తిరిగి రానుంది. అమెరికాలో ఉన్న కవిత శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. కుమారుడి గ్రాడ్యుయేషన్ కోసం కవిత అమెరికా వెళ్లారు. ఈ నెల 16న కవిత అమెరికా పర్యటనకు వెళ్లారు. కవిత పర్యటనకు సీబీఐ(Central Bureau of Investigation) ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది.

కాగా మైడియర్ డాడీ అంటూ కవిత రాసిన 6 పేజీల  లేఖ(Kavitha Writes Letter To KCR) పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. బీజేపీతో పొత్తుపై కూడా సిల్వర్ జూబ్లీ సభలో క్లారిటీ ఇవ్వలేదని కవిత ప్రశ్నించారు. పాజిటివ్, నెగిటివ్ ఫీడ్ బ్యాక్ అంటూ వివరంగా కవిత లేఖ రాశారు. వక్ఫ్ బిల్లుపై మాట్లాడి ఉంటే బాగుండేదని కవిత అన్నారు. బీసీలకు 42 శాతం కోటా అంశం విస్మరించారు. ఎస్సీ వర్గీకరణపై నోరు విప్పలేదు. పాత ఇన్ ఛార్జ్ లకే లోకల్ బాడీ బీఫాం ఇస్తారా? 2021  నుంచి పార్టీలో ఉన్నవాళ్లని వేదికపై మాట్లాడనివ్వరా?, బీజేపీని టార్గెట్ చేసిన ఉంటే బాగుండేదిని కవిత అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం, తెలంగాణ గీతం విషయంపై మోటివేట్ చేస్తారని ఎదురుచూశారని ఆమె తెలిపారు.