3 July, 2026 | 11:49 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

నిరుపేద యువతి వివాహానికి లయన్స్ క్లబ్ అఫ్ పెద్దపల్లి చేయూత

23-05-2025 01:37 PM

మంథని,(విజయక్రాంతి): రామగిరి మండలంలోని పన్నూరు గ్రామానికి చెందిన పుట్ట రజితకు వివాహం కుదిరింది. కాగా రజిత తండ్రి శంకరయ్య 15 యేండ్ల  కిందట  అనారోగ్యంతో  మృతి చెందాడు. ఈ నేపథ్యంలో రజితకు వివాహం చేయడం తల్లి రాధమ్మకు శక్తికి మించిన భారంగా మారింది.  ఆమె కుటుంబ పరిస్థితిని కుటుంబ సభ్యులు లయన్స్ క్లబ్ అఫ్ పెద్దపల్లి దృష్టికి  తీసుకువచ్చారు.

ఈ నేపథ్యంలో నిరుపేద వధువు వివాహానికి లయన్స్ క్లబ్ అఫ్ పెద్దపల్లి(Lions Club of Peddapalli) సభ్యుల సహాకారంతో సేకరించిన రూ. 22116/- రూపాయలు శుక్రవారం అమ్మాయి కి పెళ్లి పందిరిలో అందించారు. పెద్దమనుసుతో నిరుపేద యువతి వివాహానికి చేయూతనందించిన లయన్స్ క్లబ్ అఫ్ పెద్దపల్లి సభ్యులను పన్నూర్ గ్రామస్తులు అభినందించారు.ఈ కార్యక్రమం లో లయన్స్ క్లబ్ అఫ్ పెద్దపల్లి అధ్యక్షులు లయన్ వేల్పుల రమేష్, సెక్రటరీ లయన్ బోడకుంట రాంకిషన్, పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ సాదుల వెంకటేశ్వర్లు, సీనియర్ సభ్యులు లయన్ బెల్లంకొండ జయపాల్ రెడ్డి, లయన్ దుబాసి కుమార్ తదితరులు పాల్గొన్నారు.