calender_icon.png 23 May, 2025 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరం గర్బ ఆలయంలో కాశీ పండితులచే నవరత్న మాల హారతి

23-05-2025 01:52:53 PM

మహదేవపూర్,(విజయకాంతి): శుక్రవారం ఉదయం కాశీ నుండి విచ్చేసిన పండితుల ఆధ్వర్యంలో కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయంలో భక్తిశ్రద్ధలతో హారతి కార్యక్రమం నిర్వహించబడింది. సరస్వతి నవరత్న మాలా హారతి ఉత్సవాల నేపథ్యంలో ఈ ప్రత్యేక హారతి కార్యక్రమం శోభాయమానంగా జరిగింది.ప్రారంభంగా వేదఘోషల మధ్య స్వామి వారికి పూర్ణాహుతులతో హారతి సమర్పించారు. ఆలయ ప్రాంగణం పుణ్యవాతావరణంతో మార్మోగింది. కాశీ పండితులు ఆలయ ఆచార సంప్రదాయాల మేరకు హారతి నిర్వహించి, భక్తులకు దివ్యానుభూతిని కలిగించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమం అనంతరం పూజారులకు ఘన స్వాగతం పలికారు. ఈ హారతి కార్యక్రమం సరస్వతి నవరత్న మాలా ఉత్సవాల్లో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది.