calender_icon.png 23 May, 2025 | 10:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆంక్షలు లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

23-05-2025 02:19:05 PM

సుర్జాపూర్ లో బీఆర్ఎస్ ఆందోళన

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మార్కెట్ యార్డ్(Khanapur Market Yard) పరిధిలో పలు కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం అకాల వర్షానికి తడిసిపోయిందని రైతులకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖానాపూర్ మండలం సుర్జాపూర్ గ్రామం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ,బీఆర్ఎస్ నాయకులుఆందోళన చేపట్టారు. ఈ మేరకు రైతులు ఖానాపూర్ మెట్పల్లి రోడ్డుపై ధర్నా, రాస్తారోకో, చేపట్టారు. ఖానాపూర్ తాసిల్దార్ సుజాత రెడ్డి హామీతో రైతులు ఆందోళన విరమింప చేశారు. కాగా నాయకులు మాటలపై తమకు నమ్మకం లేదని ,రాతపూర్వకంగా ఆదేశాలు ఇవ్వాలని రైతుల డిమాండ్ చేశారు .కార్యక్రమంలో భూసి నరేందర్, శ్రావణ్ ,బొమ్మెన రాకేష్ ,వెంకట్ రాములు, పలువురు రైతులు పాల్గొన్నారు.