calender_icon.png 23 May, 2025 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరస్వతి పుష్కరాలలో స్నానమాచరించిన హంపి పీఠాధిపతులు శ్రీ శ్రీ విరుపాక్ష విద్యారణ్య స్వామి

23-05-2025 02:25:25 PM

మహాదేవపూర్,(విజయక్రాంతి): సరస్వతీ పుష్కరాలలో(Saraswati Pushkaralu) భాగంగా శుక్రవారం 9వ రోజున సరస్వతి ఘాట్లో పుష్కర స్నానం ఆచరించిన హంపి పీఠాధిపతి  శ్రీశ్రీశ్రీ విరుపాక్ష విద్యారణ్యస్వామి, అనంతరం సరస్వతి మాతను దర్శించుకొని, కాలేశ్వరం ముక్తేశ్వర దేవాలయం ముందుకు రాగా దేవాలయాలు అర్చకులు వేద పండితులు స్వామివారికి పూర్ణకుంభ స్వాగతం పలికి గర్భాలయంలోకి తీసుకెళ్లారు, అనంతరం దేవాలయంలో కాలేశ్వరునికి ముక్తేశ్వరునికి అభిషేకాలు నిర్వహించి, శుభ నంద దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. పీఠాధిపతులు మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోని సరస్వతి  నది అంతర్వహీనిగా కాలేశ్వరం ముక్తేశ్వర సన్నిధిలో గోదావరి ప్రాణహితతో కలసి ప్రవహిస్తుందని ఈ సరస్వతి పుష్కరాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం అభినందనీయమని అన్నారు.