calender_icon.png 12 December, 2025 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి

12-12-2025 08:22:38 PM

నారాయణపేట,(విజయక్రాంతి): నారాయణపేట నియోజకవర్గం మరికల్ మండలంలోని ఇబ్రహీం పట్నం, వెంకటాపూర్, పెద్ద చింత కుంట గ్రామాలలో, మరికల్ మండల కేంద్రంలోనీ ఇంటింటి ప్రచారంలో మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ.యస్. రాజేందర్ రెడ్డి పాల్గొని ఆయన ప్రజల నుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోస చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు.

గత పదేళ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని మళ్ళీ చేసిచూపిస్తామన్నారు. దీంట్లో భాగంగానే సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సంక్షేమ పధకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కారుకు సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పలని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు.

అందుకే ప్రజల్లో రేవంత్ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. కాంగ్రెస్ నుంచి పోటీలో అభ్యర్థులు ఓట్లు అడగడానికి వెళ్తే గ్యారెంటీలపై నిలదీయాలన్నారు. రైతులు, సాధారణ ప్రజల మద్దతు బీఆర్ఎస్ వైపే ఉందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు పార్టీ శ్రేణులు వివరించి పార్టీ గెలుపునకు కృషి చేయాలని సూచించారు... ఆదివారం జరిగే సర్పంచ్ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.