కార్యకర్తలకు అండగా బీఆర్‌ఎస్ పార్టీ
27-06-2024 12:05 AM
- పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ మధూకర్
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 26(విజయక్రాంతి): కాటారం మండలం దామెర కుంట గ్రామానికి చెందిన కనుకుట్ల సమ్మ య్య, మహాముత్తారం మండలం బోర్లగూ డెం గ్రామానికి చెందిన గండ్ర కిషన్‌రావు ఇటీవల మరణించారు. వారికి బీఆర్‌ఎస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉండడంతో పార్టీ నుంచి రూ.రెండు లక్షల చొప్పున చెక్కులు మంజూరయ్యాయి. వాటిని బుధవారం మృ తుల కుటుంబ సభ్యులకు బీఆర్‌ఎస్ మం థని నియోజకవర్గ ఇన్‌చార్జి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ ఫుట్ట మధూకర్ అందజేశారు. కార్యక్రమంలో మంథని మండల పార్టీ అధ్యక్షుడు ఏగోళపు శంకర్‌గౌడ్, నాయకులు శంకర్‌లాల్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.






