చెంచు మహిళ ఈశ్వరమ్మ ను పరామర్శించిన మంత్రి సీతక్క
26-06-2024 06:14 PM
హైదరాబాద్ : నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఆదివాసీ మహిళ ఈశ్వరమ్మను మంత్రి సీతక్క పరామర్శించారు. బాధిత మహిళకు అందుతున్న చికిత్సపై నిమ్స్ ఆసుపత్రి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. నాగర్ కర్నూల్ ఎస్పీతో ఫోన్ లో మాట్లాడి ఈశ్వరమ్మ దాడి కేసు పురోగతిని తెలుసుకున్న సీతక్క నిందితులు ఎంతటి వారైన సారే కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చిన మంత్రి సీతక్క ప్రభుత్వం తరపున రూ.25 వేలు సాయం అందిచారు.






