calender_icon.png 26 December, 2025 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేద్దాం

26-12-2025 09:50:47 PM

మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

మణుగూరు,(విజయక్రాంతి): రాబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలలో గులాబీ జెండా ఎగురవేద్దాం గులాబీ జెండా ఎగరడం ఖాయమని, పినపాక మాజీ ఎమ్మెల్యే, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు రేగా కాంతారావు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పినపాక నియోజక వర్గంలో స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన కొత్త సర్పంచ్లకు, పాలకవ ర్గానికి నేడు హనుమాన్ ఫంక్షన్ హాల్ అభినందన  సన్మాన సభ నిర్వహించబ డునని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆయా మండలాల నూతన సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, యూత్, మహిళ నాయకురాలు, అభి మానులు భారీ సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.