calender_icon.png 26 December, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని వైపు మరలిన పెద్దపులి

26-12-2025 10:07:07 PM

ఎల్ మడుగు గోదారి దాటి ఆరెంద అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: అటవీశాఖ అధికారులు

మంథని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని వైపు పెద్దపులి మారిలింది. మంథని మండలంలోని ఎల్.మడుగు గోదారి నది దాటి ఆరెంద అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నదని అటవీ శాఖ అధికారులు తెలిపారు.  పెద్దపులి ఇప్పటికే మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓసిపి దాటి ఎన్టిపిసి ఏరియాలో సంచరించిన పెద్దపులి, ఆ తర్వాత మళ్లీ చెన్నూరు అడివి ప్రాంతాల్లోకి వెళ్ళింది.

శుక్రవారం చెన్నూరు ప్రాంతం నుంచి మంథని మండలంలోని గోదావరి నది దాటి ఆరెంద అటవి ప్రాంతంలో సంచరిస్తున్న పులి అడుగులను గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు,  రైతులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళలో బయట తిరగవద్దని, పశువులను అటవీ ప్రాంతంలోకి పంపించవద్దని అటవీశాఖ అధికారులు సూచించారు.