calender_icon.png 26 December, 2025 | 11:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నట్టల నివారణ మందు పంపిణీ

26-12-2025 09:46:04 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): మండలంలోని టేకుల చెరువు గ్రామంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులను సర్పంచ్ బోళ్ళ సైదమ్మ శుక్రవారం పంపిణీ చేశారు. నట్టల వల్ల జంతువుల్లో బరువు తగ్గడంతో పాటు వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, వాటిని నివారించేందుకు ప్రభుత్వం ఉచితంగా మందులు పంపిణీ అందిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల పశు వైద్య సిబ్బంది శ్రీ గణేష్, టి గోవిందరెడ్డి,సిహెచ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.