26-12-2025 09:42:53 PM
సికింద్రాబాద్,(విజయక్రాంతి): నూతన సంవత్సవ వేడుకల్లో పాల్గొనే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకంగా ఎంఎంటీఎస్ రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ స్పెషల్ రైలు జనవరి 1న అర్దరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారు జాము వరకు లింగంపల్లి నుంచి నాంపల్లి మధ్య అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ఈ రైలు చందా నగర్, హఫీజ్ పేట, హైటెక్ సిటీ, బోరబండ, భరత్ నగర్, బేగంపేట, ఖైతరాబాద్, లక్డీకా పూల్, సహా పలు రైల్వే స్టేసన్లలో అగుతుంది. న్యూ ఇయర్ కారణంగా ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ప్రజలను గమ్యస్థానా లకు సురక్షితంగా చేర్చడానికి ఈ స్సెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.