26-12-2025 09:35:18 PM
కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ కి ప్రత్యేక ధన్యవాదాలు
పెద్ద సంఖ్యలో హాజర వైద్య పరీక్షలు చేయించుకున్న స్థానికులు
సికింద్రాబాద్,(విజయక్రాంతి): ఓల్డ్ బోయిన్ పల్లి 119 డివిజన్ లో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ జన్మదినోత్సవం సందర్భంగా పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో మహేందర్ యాదవ్ సహకారంతో మెగా కంటి పరీక్ష శిబిరం ఓల్డ్ బోయిన్ పల్లి మల్లికార్జున్ నగర్ కాలనీ సదాశివ హై స్కూల్ లో పుష్పగిరి కంటి ఆసుపత్రి డాక్టర్లు హిందూ, వేణు, వరుణ్ బృంద సభ్యులు పర్యవేక్షణలో కంటి పరీక్షలు శిబిరాన్ని కార్పొరేటర్ నరసింహ యాదవ్ రిబ్బన్ కట్ చేసి పరీక్షలు ప్రారంభించారు.
ఈ కంటి పరీక్ష శిబిరంలో 522 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 60 మంది కంటి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు. మిగతా వారికి కంటే సమస్యలతో ఉన్న 415 మందికి అద్దాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 31న కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ జన్మదిన వేడుకలు సందర్భంగా కంటి అద్దాలు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ చేతుల మీదుగా పంపిణీ చేస్తారు.. పంపిణీ చేస్తారు.