11-08-2025 01:54:32 PM
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) సోమవారం భారీ ఊరట లభించింది. రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. 2019 అక్టోబర్ లో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పోలీస్ స్టేషన్ లో రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని నమోదైన ఈ కేసును కోట్టేయాలని రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన జస్టిస్ కె. లక్ష్మణ్ కేసు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రేవంత్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన పెద్దిరాజుకు సుప్రీంకోర్టు(Supreme Court) అక్షింతలు వేసింది. అఫిడవిట్ రూపంలో క్షమాపణలు చెప్పాలని సీజేఐ జస్టిస్ గవాయ్ ధర్మాసనం ఆదేశించింది. రేవంత్ రెడ్డిపై పెద్దిరాజు దాఖలు చేసిన కేసును తెలంగాణ హైకోర్టు గతంలో కొట్టేసింది. కేసును నాగ్ పుర్ బెంచ్(Nagpur Bench) కు బదిలీ చేయాలని పెద్దిరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ లో పెద్దిరాజు హైకోర్టు జడ్జిపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు జడ్జి జస్టిస్ మౌసమి భట్టాచార్యకు(Justice Moushumi Bhattacharya) క్షమాపణలు చెప్పాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. క్షమాపణ చెబుతూ దాఖలు చేసే అఫిడవిట్ పై సుప్రీం కోర్టు నిర్ణయాన్ని జస్టిస్ భట్టాచార్యకు వదిలేసింది. వారం రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని పెద్దిరాజుకు సీజేఐ ఆదేశాలు జారీ చేసింది.