రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
నారాయణఖేడ్, సెప్టెంబర్ 2 : నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్, మనూరు, నాగల్ గిద్ద మండలాల్లో ఆయా మండలాల్లో ఎమ్మెల్యే డాక్టర్ పి. సంజీవరెడ్డి మంగళవారం పర్యటించి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు రేషన్ కార్డులు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని అన్నారు. అంతకుముందు ఆయన స్వగృహంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్నారు.
అనంతరం మనూరు మండలంలోని కమలాపూర్ చెరువును రాష్ట్ర టూరిజం అధికారులతో కలిసి పరిశీలించారు. నియోజకవర్గంలో టూరిజం అభివృద్ధికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమలాపూర్ చెరువును టూరిజం పరంగా అభివృద్ధి చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక నాయకులు శంకర్ సెట్ ,పండరి రెడ్డి, దిగంబర్ రెడ్డి, మాణిక్యరావు పాటిల్, రమేష్ చౌహన్,తాహెర్ అలీ, ఆకాశ్ పాటిల్, సత్యం సెట్, ఆయా గ్రామాల నాయకులు డీలర్లు రెవెన్యూ అధికారులుపాల్గొన్నారు.






