15-12-2025 04:07:25 PM
హైదరాబాద్: జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన ముసాయిదాపై బీఆర్ఎస్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కొత్త డివిజన్ల ఏర్పాటు, వార్డుల విభజన ముసాయిదాపై సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ నేతలు సోమవారం జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లారు. తలసాని ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ కు వినతిపత్రం అందించారు. డివిజన్ల పునర్విభజనలోని తప్పిదాలను సరిచేయాలని బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ... జీహెచ్ఎంసీ డివిజన్ల విభజన గందరగోళంగా చేశారని, డివిజన్ల పునర్విభజనలో తొందరపాటు ఎందుకు..? అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా డివిజన్లు విభజించడం తప్పు అన్నారు.