బీహెచ్‌ఈఎల్ పెన్షనర్లకు అండగా బీఆర్‌ఎస్
06-05-2024 01:08 AM
పటాన్‌చెరు, మే 5: ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలకు పరిష్కారం చూపిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన భారతీనగర్ డివిజన్ పరిధిలోని ఎల్‌ఐజీ సొసైటీ గ్రౌండ్స్‌లో సీనియర్ సిటిజన్స్‌తో సమావేశమయ్యారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సమావేశంలో ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి సతీమణి ప్రణీతరెడ్డి, మాజీ కార్పొరేటర్ అంజయ్య యాదవ్, పార్టీ నాయకులు ఆదర్శ్‌రెడ్డి, నగేశ్‌యాదవ్, పరమేశ్ యాదవ్, పృథ్వీరాజ్ పాల్గొన్నారు.




