1 April, 2026 | 7:11 AM

ఆరు గ్యారెంటీలపై రాహుల్ అబద్ధాలు

06-05-2024 01:09 AM

ఎక్స్ వేదికగా రేవంత్‌కు కేటీఆర్ సవాల్

హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): రాష్ట్రంలో మహిళలకు నెలకు రూ. 2500 నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నామని నిర్మల్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు ఆదివారం ఎక్స్ వేదికగా ఘాటుగా స్పం దించారు. మహిళలకు నగదు ఎక్కడ జమ చేస్తున్నారో చూపించాలని సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీశారు. సీఎం రేవంత్ పచ్చి అబద్దాలు మాట్లాడుతూ తప్పులు కప్పిపుచ్చుకునేం దుకు విపక్ష నేతలపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

మరోవైపు, ఆరు గ్యారెంటీలు అమలవ్వడం లేద ని ప్రశ్నించిన కేటీఆర్‌పై సీఎం రేవంత్ తనదైన శైలిలో స్పందించారు. కేటీఆర్.. నువ్వు చీర కట్టుకొని ఆడపిల్లలా తయారై ఆర్టీసి బస్సులో ప్రయాణిం చు టికెట్ అడిగితే ఆరు గ్యారెంటీలు అమలవ్వడం లేదని ఒప్పుకుంటానని ఎక్స్ వేదికగా సవాల్ విసిరారు. దీనికి కేటీఆర్ కౌంటర్ ఇస్తూ.. మహిళలకు రూ. 2500 ఇస్తున్నామంటూ రాహు ల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే రేవంత్‌రెడ్డి నువ్వా చీర కట్టుకుంటావా? రాహుల్ కట్టిస్తావా? చెప్పాలని వ్యంగ్యాస్త్రం సంధించారు.