1 April, 2026 | 4:24 AM

కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నివర్గాలకు సమన్యాయం

06-05-2024 01:06 AM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల, మే 5 (విజయక్రాంతి): రాష్ట్రప్రభుత్వం అన్నివర్గాలకు సమన్యాయం చేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడలోని ఓ ప్రైవేటు స్థలంలో ఆదివారం మేరు కులస్తులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంబించిన బీజేపీని ప్రజలు పక్కన పెట్టారని, అలాగే ఈ ఎన్నికల్లో బీజేపీని పక్క న పెడతారన్నారు. రాష్ట్ర సర్కార్ 16 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. దేశంలోని ప్రజల స్థితిగతులను, జీవన విధానాలను పరిశీలించేందుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర చేశారన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కుల గణన చేస్తామన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఎంపీ అభ్యర్థుల విజయానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. సమ్మేళనంలో నాయకుడు బింగి మహేష్ పాల్లొన్నారు.