12-01-2026 03:36:22 PM
పాత బాస్ కు కోపం రావద్దు.. కేసీఆర్ కు పేరు రావద్దు.
పదేపదే మోసపోతే ప్రజలదే తప్పు.
హైదరాబాద్: పాత బాస్ ఊరుకోరు.. రేవంత్ రెడ్డి(Revanth Reddy) రహస్యాలన్నీ ఆయన వద్ద ఉన్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఆరోపించారు. మహబూబ్ నగర్(Mahbubnagar)లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ... పాత బాస్ కు కోపం రావద్దు.. కేసీఆర్ కు పేరు రావద్దనేది రేవంత్ రెడ్డి ఆలోచన అన్నారు. పాలమూరు రైతన్నలను రేవంత్ రెడ్డి ఎండపెడుతున్నారని ఆరోపించారు.
యూరియా ఇవ్వని వ్యక్తి.. పాలమూరును సస్యశ్యామలం చేస్తామంటున్నారని తెలిపారు. ప్రజలు మోసగాళ్లనే నమ్ముతారని రేవంత్ రెడ్డి చెప్పేవారు.. రేవంత్ రెడ్డి నిజాయితీ గత మోసగాడని కేటీఆర్(KTR) విమర్శించారు. పదేపదే మోసపోతే ప్రజలదే తప్పు అవుతుందన్నారు. కృష్ణా జలాలు మన వద్ద ఉన్నప్పుడే తీసుకుంటే కిందకు వెళ్లవన్నారు. ఐటీ హబ్ పెట్టి 14 పరిశ్రమలు తెస్తే ఇప్పుడు పారిపోయేలా చేశారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో(BRS) పెట్టిన పరిశ్రమలకు ఇప్పుడు వీళ్లు రిబ్బన్లు కట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అభివృద్ధి పనులకు డబ్బులు లేవని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారని కేటీఆర్ వెల్లడించారు. డబ్బులు మూటలు కట్టి ఢిల్లీకి పంపితే రాష్ట్రంలో పనులకు ఎలా వస్తాయి? అని కేటీఆర్ ప్రశ్నించారు.