ప్రైవేటీకరణను బీఆర్ఎస్ అంగీకరించదు: జగదీష్ రెడ్డి
హైదరాబాద్: ప్రజలను అమమానించేలా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేవంలో మాట్లాడారు. అనేక రంగాలను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర జరుగుతోందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను బీఆర్ఎస్ పార్టీ అంగీకరించదన్నారు. ప్రాణం పోయినా విద్యుత్ రంగంలోకి ప్రైవట్ వ్యక్తులను రానివ్వమని కేసీఆర్ ఆనాడు స్పష్టం చేశారని తెలిపారు. ప్రజల జీవితంపై ప్రభావం చూపించే విద్యుత్ ను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పితే.. చిన్నా భిన్నం అవుతోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతాయని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తే ప్రజల ఇబ్బంది పడతారని సూచించారు. 200 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. పాతబస్తీలో ఎవరూ కూడా 200 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగించరని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.






