రాష్ట్ర గీతంపై బీఆర్‌ఎస్‌ది అనవసర రాద్ధాంతం
ప్రభుత విప్ అది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల, మే30 (విజయక్రాంతి): తెలంగాణ గీతంపై బీఆర్‌ఎస్ నాయకులు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని ప్రభుత విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన రాజన్న సిరిసిల్లలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించి కూడా అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర గీతం చేయలేకపోయారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామంటే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారనిదుయ్యబట్టారు.
అణగారిన వర్గానికి చెందిన అందెశ్రీకి సముచిత గౌరవాన్ని కల్పిస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. రాష్ట్ర గీతాన్ని ఎంఎం కీరవాణి స్వరపరుస్తున్నందుకు నానా రభస చేస్తున్న బీఆర్‌ఎస్ నేతలు, నాడు నటి సమంతను చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌ను ఎలా చేశారని ప్రశ్నించారు. అసలు రాష్ట్రానికే సంబంధం లేని నటి రకుల్ ప్రీత్ సింగ్‌ను బాలిక విద్యకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎలా నియమించారన్నారు. ఆంధ్రాకు చెందిన సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయితో యాదాద్రి ఆలయ నిర్మాణానికి రూపకల్పన చేయించిన విషయాన్ని గుర్తుచేశారన్నారు.






