3 April, 2026 | 1:43 PM

Breaking News

కొండాపూర్‌లో డ్రగ్స్ కలకలం.. పబ్‌లో సినీనటి హేమ   •   బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ — అమ్మవారి జాతరకు వెళ్లొస్తూ ముగ్గురు దుర్మరణం   •   తూప్రాన్‌లో శ్రీరాముడి రథోత్సవం.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య వివాదం   •   దొడ్డి కొమరయ్య... నేటి ప్రజావ్యతిరేక పోరాటలకు స్పూర్తి: కేసీఆర్   •   బహుజన ఆత్మగౌరవ ప్రతీక దొడ్డి కొమురయ్య   •   దక్షిణాసియా వస్త్ర రాజధానిగా తెలంగాణ — సీఎం రేవంత్ రెడ్డి   •   కలెక్టర్ ఆదేశాలు బే ఖాతర్   •   Warangal Sub-Registrar Officeలో సోదాలు.. అక్రమాల గుట్టు విప్పిన ఏసీబీ   •   సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం... గ్రూప్-1 ఆశావహులకు ఇది పెద్ద ఊరట   •   ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా భూక్యా రవి కుమార్ నాయక్   •  

ఎంపీటీసీ స్థానాల్లో మోగనున్న బీఆర్‌ఎస్ విజయఢంకా

04-10-2025 12:00 AM

వెన్నుపోటు దారులకు ప్రజలే గుణపాఠం చెబుతారు: మాజీ ఎమ్మెల్యే కంచర్ల

నల్గొండ రూరల్ అక్టోబర్ 3: ఎంపీటీసీ జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో టిఆర్‌ఎస్ విజయ డంక మోగుతుందని బి ర్ స్ నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో నల్గొండ మండల స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్గొండ మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాల్లో విజయ డంక మోగుతుందన్నారు కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కెసిఆర్ ఏ.. కావాలి...కారే గెలవాలి అనేది ప్రజల్లో బలంగా ఉందన్నారు కాంగ్రెస్ పాలన ఫెయిల్యూర్ అయిందని జనమంతా కెసిఆర్ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు.

ఎన్నికల సమయంలో వెన్నుపోటు పొడిచి పార్టీ మారిన వారికి ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారన్నారు తనతో లబ్ధి పొంది పనులు చేయించుకొని వెన్నుపోటు పొడిచారన్నారు పార్టీ ఫ్రెండు అంతా సైనికులు లాగా కలిసికట్టుగా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు ప్రత్యర్థి పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని బట్టి మనం దీ టైన అభ్యర్థిని ఎంపిక చేస్తామన్నారు మనమే గెలుస్తున్నట్లు తన వద్ద సర్వే నివేదిక ఉందని పార్టీ అభ్యర్థి విజయాన్ని ఆపలేరన్నారు రిజర్వేషన్ కారణంగా అవకాశం దొరకని వారికి పార్టీలో సరైన స్థానం కల్పిస్తామన్నారు ఈ సమావేశంలో రాష్ట్ర గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, కొండూరు సత్యనారాయణ,నల్గొండ మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు దేప వెంకటరెడ్డి, గాదె రాంరెడ్డి, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కృష్ణార్జున రెడ్డి, పార్టీ కార్యదర్శి బడుపుల శంకర్ గుండె బోయిన జంగయ్య, పంతoగి శ్రీనాథ్, కొప్పోలు విమలమ్మ, పెరిక కరుణ్ జయరాజ్,తదితరులు పాల్గొన్నారు.