03-10-2025 11:26:53 PM
పెద్ద కొడప్గల్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తెలంగాణలో పెద్ద పండుగ దసరా సందర్భంగా.. రాజకీయాలకు అతీతంగా జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అలయ్ బలయ్ కార్యక్రమంతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి జుక్కల్ నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజలకు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సంస్కృతి నలు దిశలా వ్యాపించడానికి, మనమంతా ఒక్కటే అనే సందేశం ఇయ్యడానికి 'అలయ్ బలయ్' గొప్ప వేదిక అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు..ఈ కార్యక్రమంలో పెద్ద కొడప్గల్ మండల నాయకులు పాల్గొని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. బంగారం ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు.