calender_icon.png 4 October, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతలో భక్తి భావం పెరగాలి

04-10-2025 12:00:00 AM

దుర్గామాత శోదయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి అడిషనల్ ఎస్పీ రమేష్

నల్గొండ క్రైమ్, అక్టోబర్ 3:యువతలో భక్తి భావం పెంపొందినప్పుడే  ఉన్నత లక్ష్యాలను చేరుకుంటారని జిల్లా అదనపు ఎస్పీ రమేష్ అన్నారు. హైదరాబాద్ రోడ్డులో ఉన్న చంద్రగిరి విలాస్ కాలనీలో శుక్రవారం నిర్వహించిన దుర్గామాత శోభాయాత్రను ఆయన పూజా  అనంతరం  మాట్లాడారు.

భక్తి భావం పెరగడం మంచి మార్గంలో నడిచి ఉన్నత స్థాయిలో స్థిరపడంతో పాటు కుటుంబానికి సమాజంలో గొప్ప గౌరవం లభిస్తుందన్నారు.జిల్లాలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకో కుండా దుర్గామాత శోభా యాత్రలకు అన్ని  ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ఇతర శాఖల సమన్వయంతో పూర్తిస్థాయి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్త్స్ర సైదా బాబా కాలనీ నాయకులు లోడంగి గోవర్ధన్, చందన్ యాదవ్ రత్నాకర్ రావు, పున్న కృష్ణ,శంకర్, రవీంద్రనాథ్ సుధాకర్,సత్తయ్య, శ్రీను, సైదులు, వెంకటేశ్వర్లు వెంకన్న, భవాని స్వాములు పాల్గొన్నారు.