16 July, 2026 | 1:50 AM

యువకుడి దారుణ హత్య

16-07-2026 01:40 AM

నిద్రిస్తున్న సమయంలో దుండుగుల ఘాతుకం 

సూర్యాపేట, జూలై 15 (విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా కేంద్రంలో మరో దారుణ హత్య కలకలం రేపింది. మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు సుందరయ్య నగర్‌లో నివాసం ఉంటున్న భుక్య విజయ్ (28) అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు అత్యంత దారుణంగా హతమార్చారు. మంగళవారం రాత్రి భుక్య విజయ్ తన ఇంటి వద్ద నిద్రిస్తున్న సమయంలో దుండగులు అతడిపై దాడి చేసి హత్య చేశారు.

బుధవారం ఉదయం విజయ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన కుటుం బ సభ్యులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులతో కీలక ఆధారాలు సేకరించారు. తదుపరి మృ తదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.మృతుడి అక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.