16 July, 2026 | 1:44 AM

పసుపునకు రికార్డు ధర

16-07-2026 01:41 AM

మహబూబాబాద్, జులై 15 (విజయక్రాంతి): పసుపు పంటకు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం రికార్డు ధర క్వింటాలుకు 16,159 రూపాయలు పలికింది. గోళా రకానికి 15,500 రూపాయల గరిష్ట ధర లభించగా, కాడి రకానికి 16,159 రూపాయలు లభించింది. ఇది ఈ సీజన్‌లో అత్య ధిక ధర కావడం విశేషం.