14 July, 2026 | 7:20 PM

Breaking News

ఇంటింటి సర్వైతో ఖచ్చితమైన ఓటరు జాబితా   •   ప్రతి పౌరుడు సర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి   •   విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: గోగుల సరిత   •   ఏకగ్రీవంగా మేడిపల్లి మండల పీఆర్టియుటీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు పీఏ   •   మంథనికి సింగరేణి మెడికల్, మైనింగ్ కళాశాలలు మంజూరు చేయాలి   •   ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్   •   వారం తిరగక ముందే మళ్లీ కోతుల బీభత్సం   •   పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు   •   ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •  

ఉరేసుకొని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

04-08-2025 12:00 AM

కుత్బుల్లాపూర్, ఆగష్టు 3(విజయక్రాంతి): సెమిస్టర్ ఎగ్జామ్‌లో మార్కులు తక్కువ వచ్చాయని మనస్థాపనకి గురైన బీటెక్ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కి చెందిన రమేష్ (54) సెక్యూరిటీగా పనిచేస్తూ అతని కుటుంబంతో కలిసి షాపూర్ సంజయ్ గాంధీ నగర్ లోని నివాసముంటున్నాడు.

అతని కుమారుడు అక్షయ్ (19) ఎంఎల్‌ఆర్ కాలేజ్‌లో బీటెక్ చదువుతున్నాడు. శనివారం మధ్యా హ్నం 1 గంటల సమయంలో ఫ్యాన్‌కు బెడ్‌షీట్ తో ఉరేసుకొని అక్షయ్ ఆ త్మహత్య చేసుకున్నాడు. తన తండ్రి విధులు ము గించుకొని ఇంటికి వచ్చి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. తన చావుకు కారణం సెమిస్టర్ మార్కులు తక్కువ రావడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని లెటర్ రాశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.