calender_icon.png 4 August, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భీమగోని యాదయ్య మరణించడం చాలా బాధాకరం

03-08-2025 11:05:52 PM

చండూరు,(విజయక్రాంతి): భీమగోని యాదయ్య మరణించడం చాలా బాధాకరమని  మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం గట్టుప్పల మండల కేంద్రంలో భీమగోని యాదయ్య మృతదేహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యాదయ్య బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షునిగా, ప్రజా సమస్యల కోసం నిరంతరం శ్రమించే వారని ఆయన వారిని కొనియాడారు. వారి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారు తెలిపారు. అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి బి ఆర్ ఎస్ పార్టీ తరఫున ప్రగాఢ   సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చండూరు మాజీ జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ పో రెడ్డి ముత్యంరెడ్డి, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.