calender_icon.png 6 August, 2025 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొదల్లో శిశువు మృతదేహం లభ్యం

04-08-2025 12:00:00 AM

మౌలాలిలో కలకలం

మల్కాజిగిరి, ఆగస్టు 3 : మానవత్వాన్ని మంటగలిపే ఘోర ఘటన మౌలాలిలో వెలుగుచూసింది. మౌలాలి ఎస్పీ నగర్ సమీపంలోని కల్లు కాంపౌండ్ పక్కన ఉన్న పొదల్లో ఆదివారం ఉదయం ఓ నవజాత శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమా చారం ఇచ్చారు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు అక్క డ వదిలిపెట్టిన కారణంగా శిశువు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.  ఈ దారుణానికి పాల్పడ్డవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పరిసర కాలనీల్లోని ప్రజలను పోలీసులు విచా రించడంతో పాటు సమీపంలోని ఆసుపత్రులు, ప్రసూతి కేంద్రాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.