calender_icon.png 21 July, 2025 | 12:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూరీలో దారుణం

20-07-2025 12:00:00 AM

  1. 15 ఏండ్ల బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు
  2. ఎయిమ్స్‌కు తరలింపు.. పరిస్థితి విషమం

భువనేశ్వర్, జూలై 19: ఒడిషా రా ష్ట్రంలోని పూరీలో దారుణం చోటు చేసుకుంది. బయాబర్ గ్రామ పరిధిలో 15 సంవత్సరాల మైనర్ బాలి కపై ముగ్గురు దుండగులు భార్గవి నది ఒడ్డున పెట్రోల్ పోసి నిప్పంటించారు. 70 శాతం కాలిన గాయాలతో ఉన్న ఆ బాలికను స్థానికులు భువనేశ్వర్ ఎయిమ్స్‌కు తరలించారు. ప్రస్తు తం ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉ న్నట్టు వైద్యులు తెలిపారు.

ఈ ఘట న బాలంగ పోలీస్ స్టేషన్‌కు కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలోనే సంభవించడం గమనార్హం. పోలీసులు కే సు దర్యాప్తు చేస్తున్నారు. పుస్తకాలు తెచ్చుకునేందుకు తన స్నేహితురాలి ఇంటికి వెళ్లిన సమయంలో దారిలో ముగ్గురు దుండగులు కిడ్నాప్ చేసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలి సోదరుడు తెలిపారు. ఈ ఘటనపై రాజకీయ దుమారం రేగింది. బీజేడీ అధినేత, ఒడిశా మా జీ ముఖ్యమంత్రి బిజూపట్నాయ క్ బీజేపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

బీజేపీ వైఫల్యం వల్ల ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో నిత్యం చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. ఒడిశాలో మహిళలకు భద్రత కరువైందని ఆరోపించారు. ఈ ఘటనపై తృణముల్ కాంగ్రెస్ కూడా ప్రధానిని విమర్శిస్తూ ఆరోపణలు గుప్పిం చింది.

ఇంత జరుగుతున్నా మహిళా కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించింది. భేటీ బచావో నినాదం ఏమైం దని బీజేపీని ప్రశ్నించింది. కాగా.. ఆ బాలిక చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరించనుందని ఒడిశా ఉప ముఖ్యమంత్రి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిప్రవతి పరీద తెలిపారు.