27 July, 2026 | 1:08 AM

లంకతో సిరీస్‌కు బుమ్రా దూరం?

27-07-2026 12:03 AM

ముంబై, జూలై 26: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ముందు భారత్‌కు గట్టి షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. ఇంగ్లాండ్‌తో రెండో వన్డే సందర్భంగా బుమ్రా గాయపడ్డాడు. గాయం తీవ్రత తగ్గకపోవడంతో లంకతో టెస్ట్ సిరీస్‌కు బుమ్రా దూరమైనట్టు తెలుస్తోంది. బీసీసీఐ మెడికల్ టీమ్ అతడికి జూలై 30 వరకు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. తర్వాత బుమ్రా బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చేరుకుని రికవరీ ప్రక్రియను పూర్తి చేయ నున్నాడు.