27 July, 2026 | 1:07 AM

టీజీ20 లీగ్ అక్రమాలపై నోరు మెదపరేం?

27-07-2026 12:02 AM

హైదరాబాద్, జూలై 26: టీజీ20 లీగ్‌లో అక్రమాలు, ఆర్థిక వ్యత్యాసాలపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్పందించకపోవడంపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీసీఐ కోరిన వివరణకు నిర్దేశిత నాలుగు వారాల గడువు ముగిసినా హెచ్‌సీఏ మౌనంగా ఉండడాన్ని తప్పుపట్టింది. హెచ్‌సీఏ వైఖరిని ‘అత్యంత అహంకారపూరితం‘గా అభివర్ణించింది.

టీజీ20 లీగ్ టోర్నమెంట్ వాణిజ్యపరంగా విజయం సాధించినంత మాత్రాన బీసీసీఐ అడిగిన తీవ్రమైన ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యత నుంచి హెచ్‌సీఏ తప్పుకోలేదని టీసీఏ సెక్రటరీ ధరం గురువారెడ్డి వ్యాఖ్యానించారు. బీసీసీఐ నిబంధనలను ఉల్లంఘించారా లేదా అనే విషయాన్ని తెలియజేసే బాధ్యత హెచ్‌సీఏకి లే దా అని ప్రశ్నించారు. చట్టాన్ని తమ కు నచ్చినట్లు వాడుకోవడం, పరిపాలనాపరంగా మౌనంగా ఉండటమే సరికాదన్నారు. వ్యవస్థాగత ఉల్లంఘనలు, పారదర్శకత లేకపోవడంపై వివరణ కోరుతూ తామిచ్చిన నో టీసులను హెచ్‌సీఏ చాలా తేలిగ్గా తీసుకుంటుందని మండిపడ్డారు. తెలంగాణ క్రికెట్‌కు పారదర్శకత, వ్యవస్థాగత జవాబుదారీతనం అవసరమని గురువా రెడ్డి స్పష్టం చేశారు.