15 July, 2026 | 4:53 PM

Breaking News

పెద్ద ఆత్మకూరు పల్లె దవాఖానను సందర్శించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ   •   గ్రామాల అభివృద్దే కాంగ్రెస్ లక్ష్యం   •   కంచర్లకు అదనపు ఆర్టీసీ బస్సు ట్రిప్పు మంజూరు   •   93,101,104 BLO బ్లాక్ లను సందర్శించిన మాజీ జెడ్పిటిసి   •   క్రమశిక్షణ ఐక్యతకు నీడలు ఉపకరిస్తాయి: సిఐ డి.గురుస్వామి   •   టీజీవీపీ భిక్కనూర్ మండల కళాశాల కమిటీల నియామకం   •   కంటైనర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. డ్రైవర్‌కు గాయాలు, ప్రయాణికులు క్షేమం   •   సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం   •   యోగాతో మానసిక ప్రశాంతత ఆరోగ్యం   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు సురేందర్   •  

మేడిగడ్డకు 2021లోనే బుంగ

08-06-2024 12:55 AM

సర్కారు ఆదేశాలతో గుట్టు చప్పుడు కాకుండా పూడ్చివేత

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తాత్కాలిక మరమ్మతులు

పీసీ ఘోష్ కమిషన్‌కు ఇంజినీరింగ్ అధికారుల వెల్లడి

మంథని, జూన్ 7 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బరాజ్‌కు బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో 2021లోనే బుంగ పడిందని ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. నాడు తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టి నడిపించామని, బుంగ కింద ఏర్పడిన ఇసుకను సైతం తొలగించామని వెల్లడించారు. తరువాత యధావిధిగా ప్రాజెక్టు నిర్వహణ సాగిందని కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్‌కు వివరించారు. జస్టిస్ ఘోష్ శుక్రవారం మేడిగడ్డ బరాజ్‌ను సందరించారు. శనివారం అన్నారం బరాజ్‌ను సందర్శించనున్నారు.

ఈ సందర్భంగా బరాజ్‌లకు జరిగిన నష్టాన్ని అధికారులు ఆయనకు వివరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరో రెండు బియర్ల కింద బుంగలు ఏర్పడ్డాయని, వాటిపై సోషల్ మీడియాతో పాటు పత్రికల్లో వార్తలు రావడంతో సమస్య పెద్దదిగా మారిందని తెలిపారు. ఇదే తరుణంలో ప్రభుత్వ మారడం, విచారణతో ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్ధగా మారిందని పేర్కొన్నారు.

ఏవిధంగా మరమ్మతులు చేపట్టారనే విషయంపై ఘోష్ కమిటీ క్షుణ్ణంగా వివరాలు సేకరించింది. 2021లో జరిగిన సంఘటనను ఎందుకు బయటకు చెప్పలేదని అధికారులను ఘోష్ ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఈ విషయాన్ని బయటకు  పొక్కనీయకుండా మరమ్మతులు చేయాలని ఆదేశించిందని,  ప్రభుత్వ ఆదేశాలను పాటించామని అధికారులు తెలిపారు. దీంతో పీసీ ఘోష్ ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.