1 July, 2026 | 6:53 PM

Breaking News

ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •  

పట్టపగలు తాళం వేసిన ఇంట్లో చోరీ

10-06-2025 12:22 AM

భయాందోళనలో కాలనీవాసులు

చేగుంట, జూన్ 9 : మండల కేంద్రమైన చేగుంటలోని సీఎంఆర్ కాలనీలో  తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. హమాలీ కాలనీలో  చందాయిపేట్ గ్రామానికి చెందిన చిట్ట బోయిన ఆంజనేయులు తన ఇంటికి తాళం వేసి ప్రైవేట్ కంపెనీలో ఆదివారం డ్యూటీకి వెళ్లారు. సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వెళ్ళగా ఇంటి తాళం పగలగొట్టబడి ఉందని, దొంగలు ఇంట్లో ఉన్న బీరువా ధ్వంసం చేసి బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, కొంత నగదు ఎత్తుకెళ్ళినట్లు బాధితుడు తెలిపారు. 

అలాగే జర్నలిస్ట్ కాలనీలో సైతం తాళాలు పగలగొట్టి దొంగతనం చేశారు. జర్నలిస్టులు అయిత రఘురాములు, కాశబోయిన సుధాకర్ ఇండ్లలో దొంగలు బట్టలు, వస్తు సామాగ్రిని దోచుకెళ్ళినట్లు తెలిపారు. ఒకేరోజు వరుసగా ఇండ్లలో  దొంగతనాలు జరగడంతో కాలనీ వాసులు భయపడుతున్నారు.  ఈ మేరకు  చేగుంట ఎస్త్స్ర  చైతన్య కుమార్ రెడ్డి కేసు నమోదు చేసి క్లూస్ టీంను  రప్పించి దర్యాప్తు చేస్తున్నట్లుతెలిపారు.