తాళం వేసిన ఇంట్లో చోరీ రూ: 10 లక్షలు విలువ చేసే విదేశీ కరెన్సీ బంగారం దోపిడి
నిజామాబాద్, సెప్టెంబర్ 18 (విజయ క్రాంతి): నిజామాబాద్ నగరంలోని 5.వ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేనీ సమయంలో దుండగులు కిటికి ఇనుప చువ్వలను తొలగించి ఇంట్లోకి చొరబడి దోపిడీకి పాల్పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని 5వ పోలీస్ స్టేషన్ పరిధిలో గల బాబన్ సాబ్ పహాడ్ ప్రాంతంలో నివాసం ఉండే నిషాత్ ఆప్రిన్ నే మహిళ నర్సపల్లిలోని బంధువుల ఇంటికి అవసర నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లరు.
తిరిగి గురువారం ఉదయం వారి ఇంటికి వచ్చేసరికి ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉండడంటం ఇంట్లోని బీరువా ధ్వంసం ఐ ఉండడం గమనించి దోపిడీ జరిగినా సమాచారం పోలీసులకు అందించారు. నిషాత్ ఆఫ్రిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు క్లూస్ టీమ్ దోపిడీ జరిగిన తీరును పరిశీలించి అధరాలు సేకరించారు.దోపిడీకి పాల్పడింది అంతర్ రరాష్ట్ర దోపిడీ ముఠా ఐ ఉంటుందన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేశారు.
10 లక్షల విలువ గల విదేశీ కరెన్సీ తో పాటు నగల చోరీకి కూడా జరిగినట్టు బాధితులు తమ పిర్యాదు లో తెలిపారు. సిసిఎస్ ఏసీపి నాగేంద్ర చారి సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఐదవ టౌన్ ఎస్‌ఐ గంగాధర్ బ్లూ స్కీం ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. త్వరలోనే దోపిడీ ఉంటాను పట్టుకుంటామని సిసిఎస్ ఏసీపి నాగేంద్ర చారి అన్నారు.




