19-09-2025 12:32:46 AM
జిల్లా కలెక్టర్ హైమావతి
బెజ్జంకి సెప్టెంబరు18:ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు వేగంగా పూర్తి అయ్యేలా చూడాలని అధికారులకుజిల్లా కలెక్టర్ కె హైమావతి సూచించారు.గురువారం మండలంలోని వీరాపుర్ లోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను తోటపల్లి లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మికంగా సందర్శించారు.అటెండెన్స్ రిజిస్టర్, ఓ పి రిజిస్టర్ వెరిఫై చేసి. ఓపీ కౌంట్, ఫార్మా కౌంట్ మెడికల్ ఆఫీసర్ కౌంట్ మ్యాచ్ కా వాలని మెడికల్ ఆఫీసర్ కృష్ణ తేజ ను ఆదేశించారు.
సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, ఎనీ మియా కేసుల గూర్చి ఆరా తీశారు. సీజనల్ వ్యాధులు బారిన పడకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అం దించాలని ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణాలను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, లబ్ధిదార్లతో మాట్లాడి ఇంటి నిర్మాణాలు వేగంగా పూర్తి అయ్యేలా చూడాలని, పి ఎమ్ ఏ వై యాప్ లో అప్లోడ్ ప్రక్రియ వేగంగా పూర్తి చెయ్యాలని ఏంపిడిఓ ను ఆదేశించారు. ఇంజనీర్ అధికారులు తరుచు మానిటర్ చేసి ఆయా స్థాయిలో పూర్తున నిర్మాణాలను పోటో క్యాప్చర్ చేసి అప్లోడ్ చెయ్యాలని పే- మెంట్ లబ్దిదారుని అకౌంట్ లో జమ అవుతుందని తెలిపారు.
వీరాపూర్ లోని ఇందిరమ్మ ఇంటి నిర్మాణా లబ్దిదారు గండ్ల మల్లవ్వ ఇంటినీ పరిశీలించారు. ఫైనల్ పే- మెంట్ మాత్రమే పెండింగ్ లో ఉందని గృహ ప్రవేశంకి సిద్ధం చేసుకుంటామని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఇంటి లోపల, బయట పరిశీలించి నిర్మాణం బాగా చేశారని మెడల్ ఇం దిరమ్మ గృహం కంటే బాగుందని అభినందించారు. మంచి ముహూర్తం లో గృహ ప్రవేశానికి సిద్ధం చేయాలని బయట మొక్కలను నాటాలని సూచించారు. తహసిల్దార్ చంద్ర శేఖర్, ఎంపీడీఓ ప్రవీణ్,అధికారులు తదితరులు ఉన్నారు.