calender_icon.png 26 June, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫేక్ యూపీఏ యాప్ తో బురిడీ

25-06-2025 11:11:02 PM

పెట్రోల్ బంకులను టార్గెట్..

జిల్లాలో రెండు చోట్ల బురిడీ కొట్టించిన ఘనుడు..

కామారెడ్డి (విజయక్రాంతి): ఫేక్ యూపీఏ యాప్ ను ఉపయోగించి పెట్రోల్ బంకులలో బురడి కొట్టించిన ఘనుడి ఉదంత మీది. కామారెడ్డి జిల్లా(Kamareddy District) బీర్కూర్ మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ కు యువకుడు బైక్ వచ్చాడు. ఆస్పత్రిలో అత్యవసరంగా బిల్లు చెల్లించాలని చెప్పి రూ. 17000 నగదీస్తే యూపీఐ పేమెంట్ చేస్తానని చెప్పాడు. అంత డబ్బు లేదని రూ. 9 వేలు ఉన్నాయని బంకు సిబ్బంది చెప్పడంతో వాటిని తీసుకొని యూపీఐ పేమెంట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తీరా ఆ వ్యక్తి వెళ్లిపోయాక పెట్రోల్ బంకు సిబ్బంది బ్యాలెన్స్ చెక్ చేసుకోగా డబ్బులు బ్యాలెన్స్ లో లేకపోవడంతో ఆందోళన చెందారు.

దీంతో బుధవారం బీర్కూర్ పోలీస్ స్టేషన్లో బంక్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఇదే వ్యక్తి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్లో ఓ పెట్రోల్ బంకులో రూ. 17 వేలు నగదు కావాలని తీసుకొని ఫేక్ యూపీఐ ద్వారా డబ్బు చెల్లించాడు. తీరా ఆ వ్యక్తి వెళ్లిన తర్వాత బ్యాలెన్స్ చూసుకుంటే 17000 జమ కాలేదని పట్టణ పోలీసులకు బంకు యజమాని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బీర్కూర్ పెట్రోల్ బంకు డీలర్ శశికాంత్ పోలీసులకు ఫిర్యాదు చేసిన తెలిపారు.