మోడీ దిష్టిబొమ్మ దహనం
మేడ్చల్ అర్బన్ జూలై 1 ( విజయక్రాంతి): కార్మికులకు అన్యాయం చేస్తున్న 4 లేబర్ కోడ్ లతో పాటు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా వి.బి.జి రాంజీ లాంటి పథకాన్ని పెట్టి గ్రామీణ పేదల ఉపాధిని దెబ్బతిస్తున్నారని మేడ్చల్ మండల సిఐటియు కార్యదర్శి ఎం నరేష్ ఆరోపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికారంలో ఉండి నాలుగు లేబర్ కోడ్ లతో పాటు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నాశనం చేస్తున్నారని ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.ఉపాధి హామీ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు కేటాయించాలని నరేష్ డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు కేటాయించి కార్మికులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు కేటాయించడానికి ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభు త్వాలు 60 శాతం నిధులు,కేంద్ర ప్రభుత్వం 40 శాతం నిధులు కేటాయించాలి అనడం ఉపాధి హామీ చట్టాన్ని తుంగలో తొక్కడమేనని నరేష్ విమర్శించారు.అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచాలని పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని నరేష్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు ఎన్ మల్లేష్.సిహెచ్ ప్రవీణ్. ఎన్ మహేష్.ఎం రాము.డి రవి.ఎం నాగరాజ్. నరేశ.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.






