28 August, 2026 | 2:03 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

భరోసా సెంటర్ ప్రారంభం

02-07-2026 01:40 AM

మహిళల రక్షణకు ప్రాధాన్యత

షాద్నగర్, జూలై 1(విజయక్రాంతి):గృహహింస, లైంగిక వేధింపులు మరియు కుటుం బ సమస్యలతో సతమతమవుతున్న మహిళలకు, బాధితులకు తక్షణ అండగా నిలిచేందు కు ఏర్పాటు చేసిన ’భరోసా ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్’ను షాద్నగర్ డీసీపీ శిరీష రాఘవేందర్ బుధవారం ఘనంగా ప్రారంభించారు. షాద్నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంగ ణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ కేం ద్రం ఇకపై బాధితులకు ఒక సంరక్షణ కవచంలా పనిచేయనుంది.

ఈ సందర్భంగా డీసీపీ శిరీషా రాఘవేంద్ర మాట్లాడుతూ, మ హిళలు మరియు బాధితుల భద్రతకు తా ము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని స్ప ష్టం చేశారు. ఈ భరోసా కేంద్రం ద్వారా చట్టపరమైన సలహాలు, మానసిక పరామర్శ, నిపుణులతో కుటుంబ కౌన్సెలింగ్తో పాటు బాధితులకు అవసరమైన అన్ని రకాల సహా య సేవలను ఒకే చోట (సింగిల్ విండో సిస్ట మ్) అందిస్తామని తెలిపారు.