07-11-2025 01:07:26 PM
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా(Medchal Malkajgiri District) ఘట్కేసర్ పరిధి ఔషాపూర్ వద్ద శుక్రవారం బస్సు ప్రమాదం సంభవించింది. కారును ఓవర్ టేక్ చేయబోయిన ఆర్టీసీ బస్సు డివైడర్ ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 38 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు వరంగల్ నుంచి ఉప్పల్ వస్తుంది. బస్సులో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. అటు ఆరాంఘర్ కూడలిలో తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (Telangana State Road Transport Corporation) బస్సుకు జరిగిన మరో ప్రమాదంలో, ఆగి ఉన్న బస్సును ట్రక్కు ఢీకొట్టింది.
ప్రమాదం తరువాత ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రి తరలించారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై కెపాల్ దగ్గర జనగాం డిపో ఆర్టీసీ బస్సు డ్రైవరు నిద్ర మబ్బులో డివైడర్ ఎక్కించి రాంగ్ రూట్లో వెళ్ళాడు. దీంతో అందులో ఉన్న ప్యాసింజర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇటీవల చేవెళ్ల రోడ్డులోని మీర్జాగూడ వద్ద దాదాపు 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, కాంక్రీటుతో నిండిన టిప్పర్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది ప్రయాణికులు మరణించారు.