07-11-2025 12:54:03 PM
హైదరాబాద్: గోల్నాక ఎఫ్ సీసీ క్లబ్-2 నూతన కార్యవర్గాన్ని హోటల్ ఎస్వీఎం గ్రాండ్ లో ఎన్నుకోవడం జరిగింది. క్లబ్ ఇంచార్జ్ విద్యాసాగర్ తెలంగాణ రీజినల్ ఇంచార్జ్ అబ్దుల్ ఫెరోజ్ పర్యవేక్షణలో గురువారం ఎన్నికల నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా మేడ్చల్ సంపత్ కుమార్ చారి ప్రధాన కార్యదర్శిగా పిల్లుట్ల రవీందర్ చారి ఉపాధ్యక్షులుగా పులిమామిడి మురళి చారి కోశాధికారిగా బర్మాజి లక్ష్మణ్ చారి సంయుక్త కార్యదర్శిగా నర్సింగోజు వేణు చారి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోల్నాక క్లబ్ 1 అధ్యక్షులు పులిమామిడి శ్రీహరి చారి ప్రధాన కార్యదర్శి గొట్టాల వినోద్ కుమార్ చారి కోశాధికారి పోలోజు వేణుగోపాల్ చారి, అంబర్పేట్ నియోజకవర్గ సంఘం సలహాదారులు పడకంటి అంజయ్య చారి శ్రీరామదాసు సంజీవ చారి ఉల్లెంగుల కృష్ణమాచారి క్లబ్ గౌరవ సభ్యులు కుమార్ శ్రీనివాస్ చొక్కయ్య సురేష్ రాజు కోటిచారి వెంకటేష్ తదితరులు పాల్గొని నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి శుభాకాంక్షలు, ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు సంపత్ కుమార్ కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేశారు.