చలువ పందిళ్లు ఏర్పాటు చేయండి
17-05-2024 12:05 AM
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిలో ఎల్బీనగర్ నుంచి దండుమల్కాపురం వరకు ఆరు వరుసల రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ దారిలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న బస్టాప్‌లను పూర్తిగా తొలగించారు. అదే విధంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ చాలాచోట్ల బస్టాప్‌లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ బస్సుల కో సం వేచి చూస్తూ అనుకోకుండా వర్షం వస్తే తడుస్తున్నారు. ప్రజా సౌకర్యార్థం కనీసం తాత్కాలిక బస్టాప్‌లు, చలువ పందిళ్ల వసతులైనా కల్పించాలి. జాతీయ రహదారుల సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, ఆర్టీసీ వారంతా ఈ విషయంలో స్పందించాలి.
- తలారి గణేష్, వనస్థలిపురం






