9 May, 2026 | 4:33 AM

సమాచార కమిషనర్లను నియమించాలి

17-05-2024 12:05 AM

సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో ఆయుధం లాంటిది. రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల లక్షలాది అప్పీలు పెండింగ్‌లో వుంటున్నట్టు తెలుస్తున్నది. దీనివల్ల ప్రజలకు కావలసిన సమాచారం సకాలంలో అందకపోవడం విచారకరం. అనేక ప్రభుత్వ కార్యాలయాలలో ‘సమాచార హక్కు చట్టం’ బోర్డులు కూడా లేవు. కొన్ని చోట్ల మూలకు పడవేశారు. ఎక్కువమంది అధికారులకూ ఈ మేరకు అవగాహన ఉన్నట్టు లేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ‘సమాచార హక్కు చట్టం’ అమలు తీరును మెరుగు పరిచేందుకు కృషి చేయాలి. అధికారులకు చట్టంపై అవగాహన కల్పించాలి.

- కామిడి సతీష్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా