16-07-2025 01:10:49 AM
హయత్ నగర్ -1 డిపో మేనేజర్ విజయ్
ఎల్బీనగర్, జులై 15 : ప్రయాణికుల సౌకర్యర్థం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకీకరణ కారణంగా అత్యధిక ట్రైన్ లు చర్లపల్లి స్టేషన్ నుంచి వచ్చి, వెళ్తునందునా హయత్నగర్ పరిసర ప్రయాణికుల సౌకార్యార్థం హయత్ నగర్ బస్టాండ్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్, నాచారం, మల్లాపూర్ మీదుగా చర్లపల్లి రైల్వేస్టేషన్ కు 12 ట్రిప్ లు నడుపుతున్నామని డిపో మేనేజర్ విజయ్ తెలిపారు.
మంగళవారం ఆయన ఆర్టీసీ బస్సుల సమయపాలన వివరాలు వెల్లడించారు. హయత్ నగర్ నుంచి ఉదయం 3.50, 4.50, 6.10, 7.10, 08.40, 09.40, మధ్యాహ్నం 03.05, 03.35, 05.25, 05.55, 07.55, 08.25 గంటలకు ఆర్టీసీ బస్సులు ఉంటాయని చెప్పారు.
చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి హయత్ నగర్ వరకు ఉదయం 05.00, 06.00, 07.20, 08.20, 09.50, 10.50, సాయంత్రం 04.15, 04.45, 06.35, రాత్రి 07.05, 09.05, 09.35 గంటలకు ఆర్టీసీ బస్సులు ఉంటాయని తెలిపారు.
పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
హయత్ నగర్ -1 డిపో నుంచి తక్కువ ధరతో ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ డీలక్స్ బస్సులు నడుపుతున్నట్లు మేనేజర్ విజయ్ తెలిపారు. 19వ తేదీన రత్నగిరి, వర్గల్, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి కి బస్సు ఉంటుందన్నారు. పెద్దలకు రూ,1200, పిల్లలకు రూ, 1000 ఉంటుందని, మరిన్ని వివరాలకు 9959226138, 9573149189 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని సూచించారు.