16-07-2025 10:34:30 PM
బచ్చన్నపేట,(విజయక్రాంతి): వర్షాలు కురవక చెరువుల్లో బోరు బావుల్లో నీళ్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుండడంతో బచ్చన్నపేట మండల కేంద్రంలోని. రైతులు గ్రామస్తులు నీళ్ళ బిందెలతో చెన్నకేశవ ఆలయానికి చేరుకుని శివలింగానికి జలాభిషేకం చేశారు. వానదేవుడు కరుణించి సకాలంలో వర్షాలు కురిపించి పంట పొలాలు బాగా పండే విధంగా చూసి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపాలని ఆ పరమశివుని వేడుకున్నారు.