16-07-2025 10:50:28 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు బుధవారం తెలంగాణ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన 2వ స్నాతకోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చే అర్థశాస్త్రంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీనీ అందుకున్నారు. రక్తదానంలో చేసిన సేవలకు గతంలో తమిళ్ సై సౌందర్య రాజన్ చే ఒక బంగారు, రెండు వెండి పథకాలను బాలు అందుకున్నారు. అర్థశాస్త్రంలో డాక్టరేట్ సాధించడానికి సహకరించిన వైస్ ఛాన్సలర్ యాదగిరిరావు,రిజిస్టర్ యాదగిరి,సూపర్వైజర్,అసోసియేట్ ప్రొఫెసర్ పాత నాగరాజు, ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి, సహాయ ఆచార్యులు డాక్టర్ పున్నయ్య, డాక్టర్ సంపత్, డాక్టర్ స్వప్న, డాక్టర్ దత్తహరి, డాక్టర్ శ్రీనివాస్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు.